రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్ మేనియా నడుస్తోంది. ఆయన నటించిన జైలర్ చిత్రం విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుకింగ్స్ అమెరికాలో సైతం రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఈ నెల 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రజినీ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జైలర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 

ప్రస్తుతం జైలర్‌పై అంచనాలు కూడా ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి సినిమా ఏదైనా సరే.. హీరో తర్వాతే ఎవరికైనా పారితోషికం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక సినిమాలో ఓ హీరోయిన్ రజినీ కంటే దాదాపు మూడింతలు రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అది ఏ మూవీ అంటారా?

రజినీకి ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఈ న్యూస్ ఆయన కెరీర్ ప్రారంభం నాటిది.

rajinikanth, sridevi in moondru mudichu movie

కెరీర్ ప్రారంభంలో అంటే 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో రజినీ ‘మూండ్రు ముడిచ్చు’ అనే సినిమా చేశారు. తెలుగులో వచ్చిన ‘ఓ సీత’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో నటించినందుకుగానూ రజినీకి రూ.2000 మాత్రమే ఇచ్చారు.

ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.5000. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు. ఆయన అప్పటికే ఫేమస్ కావడంతో రూ.30 వేలు ఇచ్చారు.

ఇవీ చదవండి:

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: ‘బేబి’ నటి ఆవేదన

హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

Google News