మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

ఒక హీరో సరసన తల్లి వచ్చేసి హీరోయిన్‌గా.. కూతురు వచ్చేసి చెల్లిగా నటించిన సందర్భాలు టాలీవుడ్‌లో అసలు లేవనే చెప్పాలి. ఒకే హీరోయిన్.. అటు మనవరాలిగానూ.. ఆపై హీరోయిన్‌గానూ నటించడం చూశాం కానీ ఇదైతే చూడలేదు. ఇంతకీ ఎవరా హీరో అంటారా? ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సరసన కీర్తి సురేష్ తల్లి హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు కీర్తి చిరుకి చెల్లిగా నటించారు.

ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ చిరు సరసన కీర్తి తల్లి హీరోయిన్‌గా నటించిన సినిమా ఏది అంటారా? కీర్తి తల్లి మేనక ‘పున్నమినాగు’ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటించారు. చిరు తన కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమా ఇది. నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమా కూడా కావడం గమనార్హం. ఇన్నాళ్ల తరువాత ఆమె కూతురు కీర్తి భోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లిగా నటించింది.

megastar chiranjeevi, keerthy suresh mother menaka in Punnami Nagu movie

అయితే తాజాగా కీర్తి సురేష్ తన తల్లి చిరుతో హీరోయిన్‌గా నటించిన విషయాన్ని ఆయనకు గుర్తు చేసిందట. అయితే అప్పుడు ఆయన రియాక్షన్ తనను సర్‌ప్రైజ్‌కు గురి చేసిందని కీర్తి చెప్పుకొచ్చింది. తన తల్లి చాలా అమాయకురాలని.. కీర్తి మాత్రం అలా కాదని.. చాలా స్మార్ట్ అని చిరు అన్నారట. తన తల్లి తనకు అప్పటి విషయాలు చాలా చెప్పారని కీర్తి వెల్లడించింది. చిరు అప్పట్లో చాలా కేరింగ్‌గా చూసుకునేవారట.. చిన్న పాపకి చెప్పినట్టు అన్ని విషయాలు చెప్పేవారని తన తల్లి తనకు చెప్పినట్టు కీర్తి వెల్లడించింది.

ఇవీ చదవండి:

చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

Google News