భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. రెండు రోజుల ముందు ఇలాంటి న్యూస్ నిజంగా మెగా అభిమానులకు షాకే. భోళా శంకర్ మూవీ విడుదల నిలిపివేయాలంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టులో కేసు వేశారు. భోళా శంకర్ నిర్మాతలు తనను మోసం చేశారని.. రూ.30 కోట్లకు ముంచేశారని ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆపేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. 

అసలు విషయంలోకి వెళితే.. డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ ఏజెంట్ చిత్ర హక్కులను రూ. 30 కోట్లకు కొన్నారు. ఆ సమయంలో ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకరకు సతీష్‌కు ఓ డీల్ జరిగింది. దీనిలో భాగంగా.. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక హక్కులను సతీష్‌కు ఇస్తూ అనిల్ సుంకర డబ్బులు తీసుకున్నారట. అయితే చెప్పిన ప్రకారం అన్ని ఏరియాల హక్కులు సతీష్‌కి ఇవ్వలేదట. అదేమని అడిగితే ఏజెంట్ విడుదల తర్వాత ఇవ్వాల్సిన డబ్బంతా వడ్డీతో సహా చెల్లిస్తామని అనిల్ సుంకర చెప్పారట.

Advertisement
భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

ఒకవేళ ఏజెంట్ విడుదల అనంతరం ఇవ్వలేకుంటే.. తాను నిర్మిస్తున్న భోళా శంకర్ విడుదలకు 15 రోజులు ముందు డబ్బులు చెల్లించేలా అగ్రిమెంట్ చేశారట. ఇంకా భోళా శంకర్ విడుదలకు రెండు రోజులే సమయం ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటర్ సతీష్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదట. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. తన డబ్బు తనకు ఇచ్చేవరకూ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. మరి కోర్టు ఏం చేస్తుందో చూడాలి.

ఇవీ చదవండి:

మెగాస్టార్ తో హీరోయిన్‌గా కీర్తి సురేష్ తల్లి.. ఆ సినిమా ఏంటో తెలుసా?

ఆంటీ వ్యవహారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టిందా? ఆమె మాటల వెనుక మర్మం అదేనా?

బెంగుళూరులోనే కాదు.. అమెరికాలోనూ రజినీ జైలర్ రికార్డు

గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు.. కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశమన్నారు: ‘బేబి’ నటి ఆవేదన

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

రఘువరన్‌ చనిపోవడానికి ఆయన భార్య రోహిణియే కారణమట..