‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తొలి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌లో మాత్రం కాస్త సాగదీతలున్నాయి. ఓవరాల్‌గా సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా రజినీ నటిస్తుండటం విశేషం.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం జైలర్ సినిమా కోసం రజనీ ఏకంగా రూ.110 కోట్లు తీసుకున్నట్లు తీసుకున్నారని సమాచారం. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ హీరోలకు సైతం లేదంటే అతిశయోక్తి కాదు. 70 ఏళ్ల వయసులో కూడా బాలీవుడ్ హీరోల స్థాయి కంటే హై రేంజ్‌లో రజనీ బడ్జెట్ ఉండడంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Rajinikanth remunaration for Jailer Movie

కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో జైలర్ మూవీ రూపొందింది. ఈ సినిమాలో రజినీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి అనిరుథ్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు. మొత్తానికి చాలా కాలం తర్వాత రజినీ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయింది.

ఇవీ చదవండి:

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

‘భోళా శంకర్’ చిత్రానికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..