స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ చేయకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అన్న విషయం తెలిసిందే. అలా ఎక్స్‌పోజింగ్ చేయకుండా నిలదొక్కుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో స్నేహ ఒకరు. ఆమె ‘వినయ విధేయ రామ’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన స్నేహ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

తాజాగా జిమ్ లో వర్కవుట్ చేస్తు ఓ వీడియోను తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది. ఇక స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి అవకాశాలు రావాలంటే స్లిమ్‌గా అందంగా కనిపించాల్సిందే. దీనికోసం హీరోయిన్స్ చాలా కష్టపడుతుంటారు. ఫుడ్‌ను పూర్తిగా కంట్రోల్‌లో పెట్టి వీలైనంత సేపు జిమ్‌లలో టైమ్ గడిపేస్తూ ఉంటారు. తాజాగా స్నేహ తాను వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ఆ వీడియోలో జిమ్‌లో స్నేహ తెగ కష్టపడుతోంది. ఎక్కువ బరువును లిఫ్ట్ చేస్తూ కనిపించింది. అసలే ఇటీవలి కాలంలో హార్ట్ అటాక్ ఎక్కువగా జిమ్‌లలో వర్కవుట్స్ చేస్తున్నప్పుడే సంభవిస్తున్నాయి. స్నేహ వీడియో చూసిన నెటిజన్లకు ముందుగా అదే విషయం గుర్తొచ్చింది. దీంతో అంతా ఆమెను వార్న్ చేస్తున్నారు. జిమ్‌లో అలాంటి సాహసాలు చేయవద్దని.. ఇటీవలి కాలంలో వెయిట్ లిఫ్ట్ చేస్తున్న వారికే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయని వార్న్ చేశారు. యోగా చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్

Google News