పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో బోల్డ్ హీరోయిన్స్‌ను బాగా పరిచయం చేశారు. వారిలో ఒకరు శ్రీ రాపాక. వర్మ దర్శకత్వం వహించిన నగ్నం సినిమాలో నటించి ఏమాత్రం తడబడకుండా తన అందచందాలను ఆరబోసింది. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అవడం వల్లనో ఏమో కానీ అమ్మడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడలేదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా కానీ రాని గుర్తింపు ఒక్క నగ్నంతో వచ్చేసింది. 

అయితే సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్లికి ముందు సెక్స్ చేయడం ఏమాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ఇదొక మార్గమని చెప్పుకొచ్చింది. కాబోయే భర్త సెక్స్ సామర్థ్యం ఏంటో ముందే తెలుసుకోకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని శ్రీరాపాక హితవు పలుకుతోంది.

Advertisement
పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే సెక్స్ చేయకుంటే కలిగే ఇబ్బందేంటో ఉదాహరణతో సహా వెల్లడించింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన తన స్నేహితురాలు ఒకరు ఇలాగే ఏమీ చెక్ చేసుకోకుండా వివాహం చేసుకుందట. అయితే ఫస్ట్ నైట్ రోజు ఆమెకు తన భర్త గే అనే షాకింగ్ విషయం తెలిసిందట. దీంతో తన స్నేహితురాలి జీవితం నాశనం అయిపోయిందని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీ రాపాక కామెంట్స్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇవీ చదవండి:

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ