బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

బిగ్‌బాస్‌ షో.. ఎవరేం అనుకున్నా.. కేసులు పడినా కూడా ఆ షోకి ఉండే క్రేజే వేరు. భాష ఏదైనా సరే.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ షో ముందుంటుంది. నాలుగ్గోడల మధ్య చుట్టూ కెమెరాలు.. మధ్యలో కంటెస్టెంట్స్. వారి ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఈ షో కళ్లకు కడుతుంది. ఈ సారి గతంలో మాదిరిగా ప్రతి ఒక్క విషయంపై నిర్వాహకులు ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ షో గత సీజన్ అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

కంటెస్టెంట్స్ సరిగా లేకపోవడంతో పాటు ఇచ్చిన టాస్క్‌లు సైతం ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ షో నిరాశపరిచింది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ షోకి సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. రమేశ్‌ – రాధల పాత్రతో ప్రోమో బాగా ఆకట్టకుంది. ప్రోమో ప్రకారం.. రమేశ్, రాధ ఇద్దరూ ప్రేమికులు. ఇక లాస్ట్‌లో హోస్ట్ నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ కూడా అదిరిపోయింది.

Advertisement

రమేశ్‌ కొండపై నుంచి జారిపోయి పడబోతుంటే రాధ చున్నీ ఇచ్చి పట్టుకోమంటుంది. ఇది నచ్చని నాగార్జున… ఇలాంటి క్లైమాక్స్‌లు మనం చూశామని చెప్పి ఎండింగ్ మార్చేస్తారు. ఇది అంతం కాదు ఆరంభం అంటూ చిటికేస్తాడు. అంతే..రాధకు తుమ్ము వస్తుంది. చేతిలో చున్నీని వదిలేస్తుంది. రమేశ్‌ ధడేలున కింద పడిపోతాడు. ఈసారి షో మన ఊహలకు అందదని నాగ్ సింబాలిక్‌గా చెప్పినట్టుగా ఉంది. ఇక ఈ షో సెప్టెంబర్ 3న లాంచ్ కానున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ

రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్

‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?