అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

తాజాగా నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఆగష్టు 24న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నాని, రానా దగ్గుబాటి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పాన్‌ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

ఆ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ… మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్‌ అంటున్నామని.. అసలు ఆ పదమే తనకు నచ్చదన్నాడు. అయితే తనకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్‌ ఇండియా అంటే గుర్తొచ్చేది దుల్కర్‌ మాత్రమేనన్నాడు. దీనికి కారణం కూడా చెప్పాడు.

ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు, తెలుగు దర్శకుడు, తమిళ దర్శకుడు, మలయాళ దర్శకుడు ఇలా భాషా భేదం లేకుండా దుల్కర్ కోసం కథలు రాసుకుంటారని.. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదేనని నాని తెలిపాడు.

ఇక తెలుగు టాప్ హీరోల ఫ్యాన్స్ ఊరుకుంటారా? నానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దుల్కర్ పాన్ ఇండియా రేంజ్ నటుడేనని అందులో సందేహం లేదని అయితే ఆయనొక్కరే పాన్ ఇండియా నటుడని ఎలా చెబుతావని ప్రశ్నిస్తున్నారు.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంతా గల్లీ హీరోలా? అని ఫైర్ అవుతున్నారు. అసలు ఒకరికి పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు ఇవ్వడినికి నాని ఎవడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి యాటిట్యూడ్‌ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదని స్టార్ హీరోల ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.

ఇవీ చదవండి:

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

కట్టప్ప ఇంట విషాదం..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

Google News