నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు
ప్రముఖ నటుడు, దర్శకుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా బెంగుళూరు అట్టుడికి పోయింది. ఆయనపై వివిధ చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఆయనకు ఊపిరాడనంత పనైంది. అసలు ఏం జరిగిందంటే.. నిజానికి ఉపేంద్ర ఏం అనిపిస్తే అది మాట్లాడతారు. ఫిల్టర్స్ అనేవి ఉండవు. అయితే శనివారం రాత్రి ఫేస్‌బుక్/ ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఉపేంద్ర ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారట.
దీంతో ర్యాలీలు, కేసులు అంటూ చాలానే జరిగాయి. బెంగుళూరులో రెండు చోట్ల, మండ్య, కోలారులో కూడా ఉపేంద్రపై కేసులు నమోదయ్యాయి. ఇవి చాలావన్నట్టు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా జరిగాయి. తాను చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగంతో ఆయన క్షమాపణలు కోరారు. అలాగే ట్విటర్ ఖాతాను సైతం లాక్ చేసుకున్నారు. అసలు ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సామాజిక సంక్షేమ మంత్రి మహదేవప్ప అన్నారు.
ఇక ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పేందుకు ఫోన్ చేయగా.. ఉపేంద్ర ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారట. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వెళ్లారట. అయితే అక్కడ కూడా ఆయన లేరని తెలిసింది. ఆపై వేరే వారి ద్వా్రా ఉపేంద్రను సంప్రదించేందుకు పోలీసులు యత్నించారు. మొత్తానికి ఉపేంద్రకు చెందిన రెండు ఇళ్లు, మొబైల్ వాట్సాప్‌లకు నోటీస్‌లు పంపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించిన తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరారు. ఉపేంద్ర తరుఫు న్యాయవాది వాదనను విన్న జడ్జి ఎఫ్ఐఆర్‌ఫై స్టే విధించారు.
ఇవీ చదవండి:
చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..
ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..
అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్