చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

సుస్మిత కొణిదెల.. చిరంజీవికి కూతురుగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా సుపరిచితురాలు. సైరా సినిమా నుంచి తన తండ్రి మెగాస్టార్‌కు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్‌ చేస్తోంది. మరోవైపు సుస్మిత నిర్మాతగానూ రాణిస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాల‌ను నిర్మించింది. ఇక భోళా శంకర్ మూవీకి సైతం ఆమే కాస్ట్యూమ్ డిజైనర్.

కానీ భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా దర్శకుడు మెహర్‌ రమేష్‌పై చిరు ఫ్యాన్స్‌ పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఇప్పుడు అంతే కోపాన్ని సుస్మితపై కూడా చిరు ఫ్యాన్స్ ప్రదర్శిస్తున్నారు. సైరా సినిమాకు ముందు చిరంజీవి కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉండేవని.. ఆ సినిమా తర్వాత నుంచి ఆయన కాస్ట్యూమ్స్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదంటూ మండిపడుతున్నారు.

Advertisement
భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రంగస్థలం’కు తప్ప సుస్మిత చేసిన ఏ చిత్రానికి కూడా కాస్ట్యూమ్స్ సరిగా లేవని నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి పాటలకు ఆమె ఎంపిక చేసుకున్న డ్రెస్‌లు అంతగా మెప్పించేలా లేవంటున్నారు.

70 ఎళ్ల వయస్సులో కూడా జైలర్‌లో రజనీకాంత్‌ కాస్ట్యూమ్స్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాయని.. కానీ చిరుకు మాత్రం ఇలాంటి కాస్ట్యూమ్స్ ఏంటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంటనే తన డిజైనర్‌ను మార్చాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..

అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..