తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న స్వాతంత్ర్య దినోత్సవం నాడు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ సెంటర్‌లో ఖుషి మ్యూజిక్ కన్సర్ట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. 

ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో భాగంగా సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తన ఆరోగ్యం గురించి సామ్ మాట్లాడుతూ.. ఏం చెప్పాలో తెలియట్లేదని.. మీ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నానని తెలిపింది. ఆరోగ్యంగా తిరిగొచ్చి బ్లాక్ బస్టర్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసింది.

మొత్తానికి సామ్ తన ఆరోగ్యం విషయంలో మరోసారి ఎమోషనల్ అయ్యింది. దీనిని బట్టి సామ్ ఆరోగ్యం పూర్తిగా సెట్ అవలేదని ఇంకా టైమ్ పడుతుందని అంతా అనుకుంటున్నారు.

ఇక షూటింగ్‌లో ఖుషి సాంగ్స్ విన్నప్పటి నుంచి ఈ ఆల్బమ్‌తో ప్రేమలో పడిపోయానని వెల్లడించింది. ఎప్పుడూ మీకు నచ్చిన ఓ మంచి సినిమా తీయాలనేదే తమ ప్రయ్తత్నమని.. అలాంటి సినిమానే తీశానని నమ్ముతున్నానని సామ్ తెలిపింది.

ఇవీ చదవండి:

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

Google News