ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

హైపర్‌ ఆది.. ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. తనదైన పంచ్‌ డైలాగులతో ట్రెండింగ్‌ కమెడియన్‌గా మారాడు. ఏదో జాబ్ చేసుకునే హైపర్ ఆది.. అదిరే అభి టీంలో కంటెస్టెంట్‌గా చేస్తూ ఆపై టీం లీడర్‌గా మారాడు. జబర్ధస్త్‌ కామెడీతో షో అతని జీవితాన్ని మార్చేసింది.

ప్రస్తుతం ఈటీవీ షోలలో ఎక్కువగా కనిపించేది హైపర్ ఆదియే. అటు బుల్లితెరపై రాణిస్తూనే ఇటు వెండితెరపై కూడా కమెడియన్‌గా రాణిస్తున్నాడు.

తాజాగా ఓ టీవీ షోలో హైపర్ ఆది తన ప్రియురాలిని పరిచయం చేసి షాక్ ఇచ్చాడు. ఇది ఏదో స్కిట్ కోసం చేసినట్టుగా అయితే అనిపించలేదు. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు.

ఈ క్రమంలోనే ఆది మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు కంటెంట్‌ కోసం చాలా మందికి లైన్‌ వేసినట్లు చెప్పానని… కానీ తాను నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే అని చెప్పాడు.

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

అంతలోనే ఆమెను స్టేజి పైకి పిలిచి షాక్ ఇచ్చాడు. ఆమెను ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయి చక్కగా నవ్వుతూ స్టేజ్‌పైకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు నిహారిక అట. స్టేజ్‌పైనే ‘ఐ లవ్‌ యూ నిహారిక’ అంటూ ప్రపోజ్‌ చేశాడు. నిహారిక కూడా ‘లవ్‌ యూ టూ ఆది’ అని చెప్పింది.

ఇద్దరూ ఒకరినొకరు ముద్దాడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. నిజంగా నిహారిక.. ఆది లవరే అయి ఉంటుందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ఎపిసోడ్ ప్రసారమైతే కానీ దీనిపై క్లారిటీ రాదు.

ఇవీ చదవండి:

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..