భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

బాహుబలి 1 ప్రఖ్యాత స్టావెంజర్ కన్సర్ట్‌లో ప్రదర్శిస్తున్నారు. దీనిలో భాగంగా రాజమౌళి, రమా రాజామౌళి దంపతులతో పాటు రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ నార్వేకు వెళ్లారు. ఇక అంత దూరం వెళ్లి ఏదో పని చూసుకుని తిరిగి వస్తారా? అక్కడి అందాలను ఆస్వాదించే పనిలో పడిపోయారు. అయితే రాజమౌళి మగధీర సినిమాలోని లొకేషన్స్ కోసం అప్పట్లో పలు ప్రదేశాల గురించి అధ్యయనం చేశారట.

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

అక్కడ పల్ఫిట్ రాక్‌ గురించి తెలుసుకున్నారట. అయితే అప్పటి నుంచి పల్ఫిట్ రాక్‌కి వెళ్లాలనే కోరిక ఉందట. ఇప్పుడు నార్వే ఎలాగూ వెళ్లారు కాబట్టి పల్ఫిట్ రాక్‌కు భార్యతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇద్దరూ కొండ అంచున కూర్చొని థ్రిల్ ఫీలయ్యారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా గ్రాం వేదికగా రాజమౌళి వెల్లడించారు. ఆ ప్రదేశాన్ని సందర్శించిన ఫోటోలను సైతం ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. 

Advertisement
భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

రాజమౌళి దంపతుల ఫోటోలు చూసిన అభిమానులు అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయనున్న విషయం తెలిసిందే. దీని కోసం స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తారన్న విషయం తెలిసిందే. మహేష్ కోసం ఆయన యాక్షెన్ అడ్వెంచర్ డ్రామాను సిద్ధం చేస్తున్నారట.

ఇవీ చదవండి:

తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..