రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ నటించిన చిత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచే నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఆ తరువాత వసూళ్లు రోజురోజుకూ దారుణంగా పడిపోయాయి. రెండో రోజు 70 శాతానికి పైగా వసూళ్లు తగ్గాయి. ఇక వీక్ డేస్‌లో అయితే భోళా శంకర్ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. చెప్పాలంటే భోళా శంకర్ రన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు ముగిసిపోయింది.

 ప్రపంచ వ్యాప్తంగా రూ.79 కోట్లకు భోళా శంకర్ హక్కులు అమ్ముడుపోతే.. కేవలం రూ. 27 కోట్లు మాత్రమే షేర్ అందుకుంది. అంటే రూ. 52 కోట్ల మేర నష్టాన్ని ఈ చిత్రం చవిచూసింది. మరో విషయం ఏంటంటే.. చాలా ఏరియాల్లో నిర్మాత అనిల్ సుంకర్ స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీంతో నిర్మాతకు నష్టాల తీవ్ర మరింత పెరిగిందట. దాదాపు నష్ట భారం అంతా ఆయనే మోయాల్సి వచ్చిందని సమాచారం. 

ఈ క్రమంలోనే అనిల్ సుంకర తన ఆస్తులను అమ్మకానికి పెట్టారని టాక్ నడిచింది. అయితే అందులో నిజం లేదని సమాచారం. ఈ చిత్రానికి చిరు రూ. 60 నుంచి 65 కోట్లు తీసుకున్నారట. తొలుత అయితే తన రెమ్యూనరేషన్ పైసా కూడా తగ్గించకుండా తనే తీసుకున్నారని టాక్ నడిచింది కానీ చిరంజీవి దాదాపు రూ. 10 కోట్లు వదిలేశారట. చిత్ర విడుదలకు ముందే చిరంజీవి రెమ్యూనరేషన్ చెల్లించిన అనిల్ సుంకర రూ. 10 కోట్లకు మాత్రం ముందు డేట్ వేసిన చెక్ ఇచ్చారట. ఆ చెక్‌ని ప్రజెంట్ చేయకూడదని చిరు డిసైడ్ అయ్యారట.

ఇవీ చదవండి:

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

Google News