చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు చాలామంది ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అభిమానులు అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మరీ పార్టీలు నిర్వహిస్తున్నారు.

చిరు అంటే తమకు ఎంత ఇష్టమనేది సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే చిరు కొడుకు రామ్ చరణ్ మాత్రం అందరి కంటే కాస్త స్పెషల్ విషెస్ చెప్పి ఆకట్టుకున్నాడు.

Advertisement
చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

ఇటీవలే మెగాస్టార్ ఇంటికి వారసురాలు వచ్చిన విషయం తెలిసిందే. మెగా కుటుంబం రామ్ చరణ్ కూతురితో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. చిరంజీవి సైతం ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మనవరాలితో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇక చిన్నారి క్లీంకార తరఫున రామ్ చరణ్.. మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మనవరాలిని చిరు ఆడిస్తున్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపాడు.

హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ డియరెస్ట్ చిరుత(చిరు తాత) అని రామ్ చరణ్ తన పోస్ట్‌లో కూతురి తరుఫున శుభాకాంక్షలు తెలిపాడు. ‘మా కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి బోలెడంత లవ్’ అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టాడు. అయితే కూతురుతో మెగాస్టార్ ఆడుకుంటున్న ఫోటో అయితే పెట్టాడు కానీ ఫేస్ మాత్రం రివీల్ కానివ్వలేదు. చెర్రీ కూతురిని చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఉవ్వఇల్లూరుతున్నారు. మొత్తానికి ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే..

చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?