ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటులలో దుల్కర్ సల్మాన్ ఒకరు. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ ‘సీతారామం’ సినిమాతో ఈ హీరో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. అప్పటి నుంచి తను నటించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కోథా’ చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.

అభిలాస్ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రసన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తనను చాలా మంది అభిమానులు కలిసేందుకు వస్తుంటారని.. అందులో మహిళ ఫ్యాన్స్ కూడా బాగానే ఉంటారన్నారు. ఓ కార్యక్రమంలో తనను చాలా మంది మహిళా అభిమానులు కలిశారని దుల్కర్ తెలిపాడు. అయితే కొందరు అభిమానులు సెల్ఫీ పేరిట దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటారని.. అయితే ఒక మహిళ మాత్రం తనను అసభ్యంగా తాకిందని దుల్కర్ తెలిపాడు. ఆ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందన్నాడు.

ఇవీ చదవండి:

జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి