చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్ తరువాత రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తరువాతి సినిమాలపై ఫోకస్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం అందుకు తగినట్టుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెర్రీ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. 

ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ షూటింగ్‌కి తన కుమార్తెతో టైమ్ స్పెండ్ చేసేందుకో.. లేదంటే మరొకటో కానీ చెర్రీ అయితే చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేశారు. ఇక తాజాగా ఈ షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్టు ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ షూటింగ్‌లో చెర్రీతో పాటు మరికొందరు కీలక పాత్రలతో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే దర్శకుడు బుచ్చిబాబు సానతో చెర్రీ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా అఫీయల్‌గా ప్రకటించేశారు కానీ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తవగానే బుచ్చిబాబుతో సినిమాను చెర్రీ ప్రారంభించనున్నాడు.

ఇవీ చదవండి:

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

Google News