సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే..

సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే.. 

ఏ మాయ చేసావు సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టి వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగింది సమంత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఖుషి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే ఈ జంట ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ ఎనర్జీతో పాల్గొంది. 

ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తోంది. తాజాగా ఓ మ్యూజికల్ కన్సర్ట్‌ని నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ ఎనర్జీతో పాల్గొని సక్సెస్ చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.  అలాగే విజయ్ దేవరకొండతో కలిసి సమంత చేసిన డాన్స్ కూడా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది.

ఇంత హడావుడి జరుగుతున్న సమయంలో సమంత సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి వెల్లిపోయింది. సినిమా విడుదల డేట్ దగ్గరపడుతోంది. ఇక మున్ముందు విజయ్, సమంతలు మరింత యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటారని అంతా భావిస్తున్న తరుణంలో సమంత ఇలా న్యూయార్క్‌కి సడెన్‌గా వెళ్లిపోవడం విస్మయాన్ని కలిసింది. అయితే సామ్ మమోసైటిస్ చికిత్స కోసం న్యూయార్క్‌కి వెళ్లిందట. ఇంకో ఆరు నెలల పాటు సామ్ న్యూయార్క్‌లోనే ఉంటుందని సమాచారం.

ఇవీ చదవండి:

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

Google News