సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాగ్రాం పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫైనల్‌గా తనను అర్ధం చేసుకునే వ్యక్తి దొరికాడంటూ సామ్ పోస్ట్ పెట్టింది. సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కొద్ది రోజుల పాటు నిర్వహించిన సామ్ ఆ తరువాత యూఎస్ వెళ్లిపోయింది. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో విశ్రాంతి తీసుకొంటోంది.

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ చికిత్స కోసం తన తల్లితో కలిసి న్యూయార్క్‌కు వెళ్లింది. అయితే అక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ చికిత్స కోసం మెంటల్‌గా సిద్ధమవుతోంది. ఇక అక్కడ స్నేహితులను కలుస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా ఒక ఫోటో షేర్ చేసి తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడంటూ పోస్ట్ పెట్టింది.

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

ఆ ఫోటోలో సామ్ పెద్ద కప్‌లో కాఫీ తాగుతూ కనిపించింది. నిజానికి ఆ పోస్ట్ కాఫీ గురించి అయ్యుంటుందని ఆమెను అర్ధం చేసుకున్న వాళ్లు అంటుంటే.. చాలా మంది మాత్రం సామ్‌కు జంట దొరికిందని.. మొత్తానికి ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి సామ్ పోస్ట్ కాఫీ గురించి మాత్రమే. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సామ్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. అసలామెకు అలాంటి ఉద్దేశం కూడా లేదని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే..

చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..

Google News