Jailer Dialogue: ‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రావడంతో రజనీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలై 20 రోజులు దాటుతున్నా కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తన ఏజ్‌ని దృష్టిలో పెట్టుకుని.. దానికి తగ్గ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రజిని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఫ్యాన్స్ ‘తలైవా ఈజ్ బ్యాక్’ అంటున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ‘జైలర్’ ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాకు నిర్మాతలు రూ.210 కోట్లు ఖర్చు చేయగా.. ఇప్పటికే రెండింతల కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ కూడా చాలా కొత్తగా అనిపించడంతో జనం క్యూ కడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలోని ఓ డైలాగ్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

ఓ సినీ డైరెక్టర్ ‘జైలర్’ సినిమాలోని ఓ డైలాగ్ గురించి అది రజినీ రియల్ లైఫ్‌కు సంబంధించినదని చెప్పి ఆసక్తికర చర్చకు తెరదీశారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి? దీనిపై ఎందుకంత చర్చ సాగుతోంది? సినిమాలో రజనీ కాంత్ తన కొడుకుతో ‘ఏదైనా చెప్పాలా నాన్న’ అనే డైలాగ్ ఉంటుంది. దీనిని రజనీ పదే పదే ప్రస్తావించాడు.

అయితే ఈ డైలాగ్ రజనీకాంత్ రియల్ జీవితంలోనిది అని ప్రముఖ డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ అన్నారు. ధనుష్‌తో రజికీ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకునే ముందు కూడా ఆయన ‘ఏదైనా చెప్పాలా నాన్న’ అని అడిగారట. అదీ సంగతి.

ఇవీ చదవండి:

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

Google News