Mahesh Babu-Rajamouli: మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అయితే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.

తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

విజయేంద్ర ప్రసాద్‌ తాను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో మహేశ్-రాజమౌళి చిత్రానికి సంబంధించిన ఏదో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన వెల్లడించిన అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

మహేశ్‌-రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌ నటీనటులు ఉండే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే ఇంకా వారిని సంప్రదించలేదని అన్నారు. అలాగే ఇది ఆఫ్రికాలో సాగే అడ్వెంచర్స్‌ సినిమా అని.. ఇంతకు మంచి ఎక్కువ అప్‌డేట్స్‌ ఇప్పుడే వెల్లడించకూడదని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా అప్‌డేట్స్ ఇచ్చేశారు.. ఇది చాలని ఫ్యాన్స్ సంబరపడపోతున్నారు. ఈ చిత్రం 2023 చివరి నాటికి సెట్స్‌ పైకి వెళ్లే అవకాశముంది.

ఇవీ చదవండి:

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

Google News