2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?

2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?

2021 సంవత్సరానికిగాను జాతీయ అవార్డుల ప్రకటన పూర్తైంది. ఈ జాతీయ చిత్ర అవార్డుల్లో తొలిసారిగా తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచి అద్భుతం క్రియేట్ చేస్తే.. నిన్న జాతీయ అవార్డులు దక్కించుకుని తెలుగు సినిమా సగర్వంగా నిలిచింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని మొత్తంగా 11 పురస్కారాల్ని టాలీవుడ్‌ దక్కించుకుంది. 

ఇక తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్‌ రికార్డ్‌ సాధించారు. ఇక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏకంగా ఆరు అవార్డులతో పతాకస్థాయిలో నిలిచింది. ఇదంతా ఓకే కానీ 2022లో విడుదలైన సినిమాలు 2021 సంవత్సరానికి గానూ జాతీయ అవార్డులు అందుకోవడమేంటని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఈ విషయమై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ క్లారిటీ ఇచ్చారు.

Rrr Pushpa Movies

జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ చిత్రాలకు ఇవ్వడం జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్, పుష్ప ఈ సినిమాలన్నీ 2021లోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాలను కూడా పరిశీలనకు తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణించినట్టు నీర్జా శేఖర్ చెప్పారు. అలా మన పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయన్నమాట.

ఇవీ చదవండి:

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

Google News