మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరు.. అదృష్టవంతుడిని ఎవరూ అడ్డుకోలేరు అంటారు. మూవీ ఇండస్ట్రీకి ఈ సామెత బాగా వర్తిస్తుంది. అదృష్టం ఉంటే చాలు.. ఇక్కడ అందలం ఎక్కవచ్చు. లేదంటే.. ఎంత మంచి స్క్రిప్ట్ అయినా కూడా హిట్ అనేది అసాధ్యం. ఇక తాజాగా పుష్ప మూవీకి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  

63 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలోనే ఒక తెలుగు నటుడికి ఈ అవార్డ్ రావడం అంటే అది ఎంత గొప్ప? చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అలాంటి ఛాన్స్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు మిస్ చేసుకున్నాడట. నిజానికి ముందుగా ఈ స్క్రిప్ట్‌తో దర్శకుడు సుకుమార్.. మహేష్ దగ్గరకే వెళ్లారట. అయితే దీనికి ఆయన నో చెప్పారట. ఆ తరువాత అల్లు అర్జున్‌ని సుక్కు సంప్రదించారట. బన్నీ ఓకే చెప్పడం స్క్రిప్ట్ పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి.

నిజానికి పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారి ఆల్రెడీ ఒక గిఫ్ట్ అందుకున్నాడు. ఆ తరువాత నేషనల్ అవార్డ్‌తో ఇక బన్నీ రేంజే మారిపోయింది. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది.

నిజానికి మహేష్ – సుక్కు కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ సమయంలో మహేష్ దగ్గరకు సుక్కు తీసుకెళ్లింది ఈ స్ర్రిప్ట్ కాదని.. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధినదని ఓ టాక్. అయితే అది మహేష్ కాదనడంతో ఎర్ర చందనం స్మగ్లింగ్ పాయింట్‌ని కూడా వినిపించారట. కానీ మహేష్ సంతృప్తి చెందక పోడంతో సుక్కు సైలెంట్ అయిపోయారట.

ఇవీ చదవండి:

2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

చిరిగిన చొక్కా వేసుకునే చిరు పెళ్లి చేసుకున్నారట..

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

Google News