ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సలార్’. ఈ సినిమాకు ముందు ప్రభాస్‌కు వరుస అపజయాలు ఎదుర్కొన్నాడు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ముదులపడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంచనాలకు తగ్గట్టుగా టీజర్ ఓ రేంజ్‌లో ఉంది.

ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దీంతో నెల రోజుల ముందే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఓ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదంటూ మరో టాక్ కూడా వచ్చింది. ఇంకా పెండింగ్ వర్క్స్ ఏవో ఉన్న కారణంగా ఇది అనుకున్న టైంకి వచ్చే అవకాశం లేదంటూ ప్రచారం నడిచింది.

ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

ఈ ప్రచారానికి శృతిహాసన్ ఒక్క అప్‌డేట్‌తో ఫుల్ స్టాప్ పెట్టేసింది. సలార్ మూవీ ఐదు భాషల్లో రూపొందింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని.. తాను డబ్బింగ్‌లో పాల్గొంటున్నానంటూ ఒక అప్‌డేట్ ఇచ్చింది. వరుసగా ఒక్కో లాంగ్వేజ్‌కి డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోందట. ఈ న్యూస్ వినగానే సినిమా అనుకున్న సమయానికి విడుదల అవడం పక్కా అని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. సలార్ డబ్బింగ్ పనులు మొదలయ్యాయని తెలుస్తున్న నేపథ్యంలో సలార్ వాయిదా పడే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?

బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?

మహేశ్, రాజమౌళి కాంబోపై అదిరిపోయే అప్‌డేట్

‘జైలర్’ మూవీలో డైలాగ్ రజినీ రియల్ లైఫ్‌లోనిదేనట..

Google News