సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శర్వా.. ఆందోళనలో ఫ్యాన్స్..
తెలుగు ఇండస్ట్రీలో శర్వానంద్‌ది ఒక డిఫరెంట్ స్టైల్. శర్వానంద్ మూవీస్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆనందంగా చూసేయవచ్చు. మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌లో బాగా ఆకట్టుకున్నాడు. ఎందుకోగానీ శర్వాకు ఇటీవల పెద్దగా హిట్స్ లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రేమించిన యువతినే వివాహం కూడా చేసుకున్నాడు. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డితో శర్వానంద్ వివాహం వైభవంగా జరిగింది.
తాజాగా శర్వానంద్ కు సంబంధించి ఒక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జాను మూవీ షూటింగ్ సమయంలో శర్వాకు ప్రమాదం జరిగింది. దాని వల్ల అప్పట్లో శర్వా చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ గాయం మళ్లీ ఇప్పుడు శర్వానంద్ ను ఇబ్బంది పెడుతోందట. దీంతో సర్జరీ చేయించుకునేందుకు శర్వానంద్ అమెరికా వెళ్లాడని సమాచారం. సర్జరీ పూర్తి చేసుకుని కాస్త కోలుకోగానే తిరిగి ఇండియాకు వస్తాడట. అయితే శర్వా సర్జరీ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందనున్న మూవీలో హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడు. అలాగే బేబీ ఆన్ బోర్డ్ మూవీ ప్రకటించాడు. ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఇది చిరుతో నటిస్తున్న రెండో సినిమా కావడం గమనార్హం. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చిరుతో కలిసి నటించిన శర్వా తన నటనకు అద్భుతమైన మార్కులు వేయించుకున్నాడు. అలాంటి అవకాశమే శర్వానంద్ కి ఇప్పుడు మళ్లీ వచ్చింది.
ఇవీ చదవండి:
ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్
మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!
2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?
బన్నీకి నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది..?