అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణికి ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సుదీర్ఘ ప్రయాణం సాగించారు. 1985లో విడుదలైన లేడీస్ టైలర్ మూవీతో వెండితెరకు పరిచయమైన తనికెళ్ల భరణి.. ఇప్పటికీ సినీ రంగంలో రాణిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యారు.

తనకు అసలు ఏడో తరగతి వరకు కూడా నాకు చెప్పులు లేవు. ఎంత ఎండగా ఉన్న వట్టి కాళ్లతోనే తిరిగేవారట. ఒకసారి తన తండ్రి చేత చెప్పులు కొనిపించుకోవాలని ఒక కాలుతున్న సిగిరెట్‌పై కాలు వేసి గట్టిగా అరిచారట. తన తండ్రి అది చూసి చెప్పులు కొనిపిస్తారనుకుంటే చూసుకుని నడవాలి కదరా వెధవ అన్నారంటూ నవ్వుతూ తెలిపారు. అప్పట్లో ఏదైనా పెద్ద తప్పు చేస్తే చెట్టుకు కట్టేసి మరీ తన తండ్రి కొట్టేవారని తనికెళ్ల భరణి గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఇక తనికెళ్ల భరణి తన తండ్రి జేబు నుంచి డబ్బులు దొంగతనం కూడా చేసేవారట. రూపాయి.. రెండు రూపాయలు కొట్టేసేవారట. ఒకసారి మాత్రం రూ.100 కొట్టేసి అడ్డంగా దొరికిపోయారట. ఆయన తండ్రికి బీభత్సమైన కోపం వచ్చిందట.. జైల్లో పెట్టిస్తానంటూ బెదిరించారట. ఇక సిగిరెట్ కూడా తాగేవారట. అంతేకాదు.. ఒక దశలో గంజాయి తాగే అలవాటు కూడా అయ్యిందని.. చాలా వ్యసనాల బారిన పడ్డానని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శర్వా.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

2022లో విడుదలైన సినిమాలకు 2021 జాతీయ అవార్డులేంటి..?