బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

తొలుత సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఆపై బిగ్‌బాస్ షోతో బాగా ఫేమస్ అయిపోయి.. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిన నటి రోహిణి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా కూడా బాగానే రాణిస్తోంది. మరోవైపు వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతోంది. 

ఇటీవల రోహిణి కాలుకి గాయమైంది. సర్జరీ చేయించుకోవడంతో కొంత కాలం పాటు నటనకు దూరమైంది. ప్రస్తుతం తిరిగి బుల్లితెరపై కనిపించి సందడి చేస్తోంది. అయితే తాజాగా రోహిణి ఓ షోలో సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే తన బ్రేకప్ గురించి చెప్పింది. తనకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడట. అయితే అతనితో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా బ్రేకప్ అయ్యిందని రోహిణి చెప్పుకొచ్చింది. 

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

బ్రేకప్ తర్వాత రోహిణి చాలా కృంగిపోయిందట. చాలా నరకాన్ని అనుభవించానని ఆమె తెలిపింది. చాలా డిప్రెషన్‌కి గురైందట. ఆ సమయంలో ఫ్రెండ్సే తనకు చాలా అండగా ఉన్నారని వారి కారణంగానే ఆ బాధ నుంచి బయటపడ్డానని రోహిణి తెలిపింది. వాడు నీ కాలి గోటికి కూడా సరిపోడంటూ వాడి గురించి నువ్వు ఇంతలా బాధపడటమేంటంటూ ఫ్రెండ్స్ ధైర్యం చెప్పారట. ఒక ఆఫ్ట్రాల్ గాడి గురించి తాను ఇంతలా ఆలోచించడమేంటని తను కూడా ఓ నిర్ణయానికి వచ్చిందట. అలా తను ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డానని రోహిణి తెలిపింది.

ఇవీ చదవండి:

అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?

సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శర్వా.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఒక్క అప్‌డేట్‌తో ప్రభాస్ ఫాన్స్ లో జోష్ పెంచిన శృతి హాసన్

మహేష్ అందుకోవాల్సిన అవార్డ్.. అల్లు అర్జున్ అందుకున్నాడట..!

Google News