‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Guntur Kaaram: వామ్మో.. ఈ కాపీ క్యాట్ గోలేంటి? మహేష్ టీజర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.  అతడు, ఖలేజా సినిమాలు మహేష్, త్రివిక్రమ్‌లకు నిరాశ మిగిల్చినా కూడా ఈ సినిమా మాత్రం సక్సెస్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి మేకర్స్ దింపనున్నారు. ఈ చిత్రంలో మహేష్ లుక్ పోకిరీ మూవీ స్టైల్లో ఉంటుందని అంతా భావిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ లీక్ అయి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ డైలాగ్స్ విని ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు.

మహేష్ బాబు గురించి ఒక వ్యక్తి.. ‘చాలా మొండివాడు గురువుగారు.. సర్రున కోపం వస్తుంది చూడండి’ అని అంటాడు. దీనికి మరో క్యారెక్టర్… ‘తెలుస్తోంది వాడికి మొత్తం వాళ్ల అమ్మ పోలిక’ అని అంటుందట. ఈ డైలాగ్ మహేష్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మహేష్ బీడీ తాగడం చూసిన ఫ్యాన్స్ పోకిరీలో స్మోక్ చేశాడు. అది సూపర్ హిట్ అయ్యిందని.. ఇక ఇప్పుడు గుంటూరు కారంలో కూడా మహేష్ స్మోక్ చేస్తూ కనిపించాడు కాబట్టి సెంటిమెంట్ వర్కవుట్ అయి ఇది కూడా పోకిరి మాదిరిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..

బిగ్‌బాస్ 7.. షాకింగ్ అప్‌డేట్స్.. షో ఒక్కటే కానీ..

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?