ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

టాలీవుడ్‌లో ఇప్పుడో ప్రాక్సీ వార్ నడుస్తోందని టాక్ నడుస్తోంది. గతంలో నందమూరి బాలకృష్ణకు.. జూనియర్ ఎన్టీఆర్ అంటే పెద్దగా పడేది కాదు. అసలు ఎన్టీఆర్‌ను ఆయనను పలకరించేవారు కూడా కాదని టాక్. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం తగ్గింది. మంచి ర్యాపో పెరిగింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా దూరం పెరిగింది. ఆ సంగతి నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 

ఇక రీసెంట్‌గా జరిగిన ఒక వేడుకలో తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దర్నీ బాలయ్య ఏమాత్రం పట్టించుకోని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగానే.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విశ్వ విఖ్యాత నటసార్వభౌముని పేరు మీద కాయిన్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా హాజరైంది ఒక్క ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తప్ప. జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే కల్యాణ్ రామ్ కూడా ఇలాంటి వేడుకలకు దూరమవుతున్నారట.

ఎన్టీఆర్ మనవళ్లు ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక సోషల్ మీడియా అయితే రెండు వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గం ఎన్టీఆర్‌పై సానుభూతి కురిపిస్తుంటే మరో వర్గం మాత్రం ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కాకపోవడమేంటంటూ చురకలు వేస్తూ నందమూరి కుటుంబానికి అనుగుణంగా కామెంట్స్ చేస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ తారక్ ఫ్యాన్స్ అనేలా సీన్ మారిపోయింది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

ఇవీ చదవండి:

‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..

బిగ్‌బాస్ 7.. షాకింగ్ అప్‌డేట్స్.. షో ఒక్కటే కానీ..

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి

విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత

Google News