‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..
చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఖాతాలో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ పడింది. తన ఏజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను ఎంచుకుని అదిరిపోయే నటనతో రజినీ తన జైలర్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించగలిగారు. జైలర్ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీలోని ఓ జెర్సీ వివాదాస్పదమైంది. ఆ జెర్సీతో రజినీ కనిపించిన సీన్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది.
రజినీ జెర్సీలో కనిపిస్తే తప్పేంటి అనుకుంటున్నారా? అది ఆర్సీబీ జెర్సీ. జైలర్ మూవీలో రజినీ మనవడిని చంపేందుకు విలన్ గ్యాంగ్ వస్తుంది. ఆ సమయంలో తన మనవడిని చంపడానికొచ్చిన విలన్ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని చంపేస్తాడు. అప్పుడు రజినీ ఆర్సీబీ జెర్సీతో కనిపిస్తారు. అది బెంగుళూరు జట్టు జెర్సీ అట. కాబట్టి ఆ సీన్‌ని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ‘జైలర్’ మూవీ యూనిట్‌కి ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు.. ఈ ఆదేశాలు తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు అయ్యేలా చూడాలంటూ తీర్పును వెలువరించింది. అసలు ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ జెర్సీ గురించి ఎవరూ కూడా అంటే ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సహా ఇతర వ్యక్తులెవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ కోర్టు ఈ విషయంలో స్వయంగా కల్పించుకుని ఆదేశాలు జారీ చేయడమనేది కాస్తంత షాకింగ్‌గానే అనిపించింది. ఇక ఈ మూవీ రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా దూసుకెళుతూనే ఉంది.
ఇవీ చదవండి:
బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!
అప్పట్లో.. దొంగతనాలు, గంజాయి కూడా తీసుకునేవాడినంటూ షాకిచ్చిన తనికెళ్ల భరణి
విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడో చెప్పిన సమంత
వామ్మో.. సమంత పక్కన కూర్చొన్నందుకు అన్ని లక్షలా?