‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబో అంటేనే ఒక సెన్సేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాంబో రిపీట్ కాబోతోంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్వయంగా వెల్లడించింది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఖుషి’ మూవీ నేడు విడుదలైంది. ఈ విడుదలకు ముందు చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహించింది.

ఈ ప్రమోషన్స్‌లో అర్జున్ రెడ్డి కాంబోపై మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. డియ‌ర్ కామ్రేడ్, ఖుషి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మూడో మూవీ చేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రవిశంకర్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా కాంబోలో ఓ మూవీ ఫిక్స్ చేసేందుకు సిన్సియ‌ర్ గా ట్రై చేస్తున్నామ‌ని వెల్లడించారు. ఇక ఇంత సిన్సియర్‌గా ట్రై చేస్తే వర్కవుట్ కాకపోవడమేంటి?

Advertisement

మరోసారి అర్జున్ రెడ్డి కాంబో రిపీట్ అవడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. నిజానికి అర్జున్ రెడ్డికి ముందు విజయ్ దేవరకొండ పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో సందీప్ వంగా పేరు కూడా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మారుమోగింది. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో హిందీలో సందీప్ వంగా రీమేక్ చేశారు.

ఇవీ చదవండి:

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..