నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

దక్షిణాదిలో పవర్ ఫుల్ నటుల్లో ఒకరు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ఏదైనా సినిమాలో ఉన్నాడంటే.. అది హిట్ అయినా.. ఫట్ అయినా కేవలం ఆయన కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ ఖాన్‌ పఠాన్‌ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్‌. ఈ చిత్రం ద్వారా దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 7న ప్రంపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను చదువుకునే రోజుల్లో తన లవ్ స్టోరీని వెల్లడించారు.

తన స్కూల్ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించానని.. అయితే అది వన్ సైడ్ లవ్ అని విజయ్ సేతుపతి తెలిపారు. అయితే ఆ అమ్మాయి మాత్రం తాను హీరో షారుక్‌ ఖాన్‌ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందట. అప్పటి నుంచి షారుఖ్‌పై పగ పెంచుకున్నానని.. దానిని ఈ చిత్రంలో తీర్చుకున్నానని విజయ్ సేతుపతి వెల్లడించారు. షారుఖ్ మాట్లాడుతూ.. తనపై విజయ్ సేతుపతి పగ తీర్చుకోలేరని.. తనకు పెద్ద అభిమాని కావడమే అందుకు కారణమని వెల్లడించారు.

ఇవీ చదవండి:

‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

Google News