పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పవన్ బర్త్ డే పురస్కరించుకుని ఇవాళ ముఖ్యంగా మూడు అప్‌డేట్స్ వచ్చాయి. హరి హర వీరమల్లు నుంచి పోస్టర్.. దర్శకుడు సుజిత్ తో చేస్తున్న ఓజీ టీజర్ విడుదలై పవన్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాయి. ముఖ్యంగా ఓజీ టీజర్ అయితే అంచనాలను మించిపోయేలా ఉందని టాక్. ఈ క్రమంలోనే నేడు పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ప్రకటన కూడా వచ్చింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాతగా ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. నిజానికి పవన్ ఫ్యాన్స్‌కి ఇది ఊహించని సర్‌ప్రైజే. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ అని పోస్టర్‌పై రాసి ఉంది. మొత్తానికి పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవాలని పోస్టర్ ద్వారా చెబుతున్నారు. కాలాన్ని బట్టి మనుషులు, వాళ్ళ పనులు ఉంటాయని చెబుతున్నట్టుగా ఉంది. మొత్తంగా ఇదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

 కాగా ఈ కాంబినేషన్ చాలా కాలం క్రితమే ప్రకటించారు కానీ ఇవాళ ఇలా సడెన్ సర్‌ప్రైజ్ ఇస్తారని మాత్రం అనుకోలేదు. వకీల్ సాబ్ సినిమాతో పాటే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మూవీని సైతం ప్రకటించడం జరిగింది కానీ ఏవో కారణాలతో ప్రాజెక్ట్ చాలా డిలే అయ్యింది. మరి ఈ కథ అప్పుడు అనుకున్నదేనా? కాదా? అనేది మాత్రం తెలియడం లేదు. ఇది అయితే రీమేక్ కాదని.. స్ట్రెయిట్ మూవీ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

Google News