‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

హీరో నాగ చైతన్య కెరీర్‌లోనే కాదు.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. సమంతను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. సమంతతో విడాకుల విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే వీరి డైవర్స్ వెనుక సుమంత్ అక్క సుప్రియ ఉందంటూ టాక్ నడిచింది. అయితే తాజాగా ఓ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సుప్రియ నిర్మాణ సారథ్యంలో బాయ్స్ హాస్టల్ అనే సినిమాను రూపొందించడం జరిగింది. ఈ సినిమా ప్రీమియర్ షోకు సుప్రియతో పాటు నాగ చైతన్య కూడా వెళ్లాడట. అయితే ఈ షో మధ్యలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి సినిమా ట్రైలర్ వచ్చిందట. అది చూడగానే వెంటనే చైతూ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయమై ఓ ఇంటర్వ్యూ నాగ చైతన్య స్పందించాడు. అసలు అలాంటిదేమీ లేదని.. ఇవన్నీ ఎవరో కావాలని సృష్టించిన రూమర్ అని తెలిపాడు. తను థియేటర్ నుంచి బయటకు వచ్చాననడం చాలా పెద్ద అబద్ధమని తేల్చాడు. ఇక చైతు అయితే పలుమార్లు సమంత విషయంలో చాలా మంచిగా రెస్పాండ్ అయ్యాడు. ఏనాడూ కూడా ఆమె గురించి ఏ ఒక్క మాట కూడా నెగిటివ్‌గా చెప్పింది లేదు. దీనిని బట్టే తెలుస్తోంది. చై గురించి జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారమని.

ఇవీ చదవండి:

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్