ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చిరు కోసమా? షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్

స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌లో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్ పాయ్, ప్రయమణి జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్ పాయ్ అండర్ కవర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర చేశాడు. ఈ వెబ్ సిరీస్ ఓ రేంజ్‌లో సక్సెస్ అయ్యింది.

సిరీస్ 1 సక్సెస్‌తో సిరీస్ 2ని కూడా రూపొందించారు. దీనిలో సమంత కీలక పాత్ర చేసింది. సామ్‌కి కూడా ఈ వెబ్ సిరీస్‌తో సామ్ బాలీవుడ్‌లో ఫేమస్ అయిపోయింది. అయితే అసలు రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌ను అప్పుడే ఖైదీ నంబర్ 150తో కమ్ బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కోసం రాసుకున్నారట. దీనిని అన్నీ ఓకే అయితే అశ్వినీ దత్ నిర్మించాల్సి ఉందట. 

రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మాన్ సిరీస్ స్క్రిప్ట్‌ను మెగాస్టార్‌కు చెప్పారట. కానీ ఇది భార్య పిల్లలున్న మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ కావడమో మరోకటో కానీ ఈ స్క్రిప్ట్ పట్ల చిరు ఏమాత్రం ఆసక్తి చూపలేదట. కావాలంటే మార్పులు, చేర్పులు చేద్దామని రాజ్ అండ్ డీకే చెప్పినా కూడా ఆయన వినలేదట. పిల్లల పాత్రలను లేపేద్దాం అవసరమైతే అని కూడా చెప్పారట. కానీ చిరు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో మనోజ్ బాజ్ పాయ్‌తో దీనిని రూపొందించారని అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇవీ చదవండి:

చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..

బిగ్‌బాస్ 7.. షాకింగ్ అప్‌డేట్స్.. షో ఒక్కటే కానీ..

Google News