ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

బాలీవుడ్ సినిమా ‘గదర్-2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ వసూళ్లతో హిస్టారికల్ రన్‌ని కొనసాగిస్తోంది ఈ చిత్రం. ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా.. అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించగా దర్శకుడు అనీల్ శర్మ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం ఫాస్టెస్ట్ 500 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలవడం విశేషమని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా ఇంటర్వ్యూల్లో భాగంగా.. డైరెక్టర్ అనీల్ మాట్లాడిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే.. గదర్ సినిమాలో ఆ పాత్రకు నేటి తరం హీరోలతో చేయాల్సి వస్తే.. తారా సింగ్ పాత్రకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రమే సరితూగుతారని చెబుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

జూనియర్ మాత్రమే..!

సన్నిడియోల్ పాత్ను ఇప్పుడు బాలీవుడ్ యంగ్ జనరేషన్‌లో హీరోలు ఎవరైనా చేయగలరా..? అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. దీనికి ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా బాలీవుడ్‌లో ఎవరూ చేయలేరని ఒకే ఒక్క మాటతో సమాధానమిచ్చేశారు.

తారాసింగ్ పాత్రకు న్యాయం చేయగలిగే యంగ్ హీరోలు బాలీవుడ్‌లో లేరని.. దక్షిణాదిలో మాత్రం చాలా మందే హీరోలు ఉన్నారని దర్శకుడు చెప్పారు. ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు సరిగ్గా సెట్ అవుతారని.. ఆయన మాత్రమే న్యాయం చేయగలరని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇప్పుడీ ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బుడ్డోడి ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇదీ ఎన్టీఆర్ సత్తా.. దేశమే బుడ్డోడిని గుర్తించిది అని.. గర్వంగా చెప్పుకుంటున్నారు వీరాభిమానులు.

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

గదర్.. గదర్..!

కాగా.. అనిల్ శర్మకు దర్శకుడిగా బాలీవుడ్‌లో ఎలాంటి పేరు, గుర్తింపు ఉందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సిరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్, ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలను తెరకెక్కించడంలో ఈయన తర్వాతే ఎవరైనా. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలో చాలానే తెరకెక్కించి అతి తక్కువ సమయంలోనే తన పేరును యావత్ భారత్‌కు చాటి చెప్పుకున్నారు.

అలా 2001లో ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’ అనిల్ తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో సన్నీడియోల్ తారాసింగ్ పాత్ర చేశారు. అప్పుడే తనలోని నటుడ్ని బయటికి తీసి.. సూపర్బ్ అనిపించుకున్నారు. ఇక ‘గదర్-2’లో బహుశా సన్నీ తప్ప మరెవరూ చేయలేరేమో అనేలా బాలీవుడ్ ప్రేమికులు చెప్పుకుంటున్న పరిస్థితి. పాక్ చెరలో బందీగా ఉన్న తన కుమారుడ్ని విడిపించుకోవడానికి తారాసింగ్ ఏం చేశాడు..? అనేది కథాంశం. అయితే ప్రస్తుతానికి గదర్-3 తెరకెక్కించే ఆలోచన లేదని అనిల్ శర్మ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం

‘ఖుషి’ ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ పాజిటివా? నెగిటివా?

బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.. కానీ..