అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ నిన్న ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సీజన్‌ 7 ఆదివారం గ్రాండ్‌గా మొదలైంది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో నాగార్జున ఆసక్తిని రేకెత్తించారు.

ముందుగా నాగ్ ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలన్నింటినీ ప్రేక్షకులు వివరించారు. ఆ తర్వాత ‘సీజన్‌-7’లో అలరించనున్న కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు.

Advertisement

ఇక ఈ షోలో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి సందడి చేశారు. తమ కొత్త సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. వీరిద్దరూ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి, కంటెస్టెంట్‌లను ఉత్సాహ పరిచారు.

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

అయితే తొలుత ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు కంటెస్టెంట్‌లకు నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రీఫ్‌కేస్‌లో రూ.20లక్షలు పెట్టి, ‘వెళ్లిపోవాలనుకున్న వారు ఆ మొత్తాన్ని తీసుకుని ఇప్పుడే బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోవచ్చు’ అని చెప్పారు. ఎవరూ అంగీకరించకపోవడంతో రూ.5లక్షలు చొప్పున పెంచుకుంటూ రూ.35లక్షల వరకూ వెళ్లారు.

నటుడు శివాజీ కాస్త ఆసక్తి చూపినా, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.

ఇక ఈ సీజన్‌లో అలరించేందుకు 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. వారిలో అప్పటి హీరో శివాజీ, నటి షకీలా, నటి కిరణ్ రాథోడ్, సీరియల్ నటులు ప్రియాంక జైన్, నటుడు అమర్ దీప్, ప్రముఖ సింగర్ దామిని భట్ల, ప్రిన్స్ యవార్, నటి శుభశ్రీ, కార్తీకదీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టి, ఆట సందీప్, యూట్యూబ్ టేస్టీ తేజ, నటి రతిక రోజ్, నటుడు డాక్టర్ గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ ఉన్నారు.

ఇవీ చదవండి:

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

‘అర్జున్‌రెడ్డి’ కాంబోపై ఇంట్రస్టింగ్ విషయం