పొలిటికల్ ఎంట్రీపై విశాల్ ఫుల్ క్లారిటీ..

Vishal Political Entry

తమిళ నటుడు, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన టాలెంటెడ్ హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త కొన్నేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా.. ఆయన సినిమా ఏదైనా రిలీజ్‌కు రెడీ అయినా ప్రెస్ మీట్‌లో.. ఇక ఇంటర్వ్యూల్లో అయినా ‘పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..?’ అనే ప్రశ్న కచ్చితంగా ఉంటోంది. బహుశా ఇప్పటి వరకూ వందల సార్లు ఈ ప్రశ్నకు హీరో సమాధానం ఇచ్చి ఉంటారు. అయితే.. కుప్పం నుంచి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై పోటీచేస్తున్నారనే వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి. పైగా ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇదంతా నిజమేనని అందరూ భావించారు. అయితే ఆయన నుంచి ఎలాంటి క్లారిటీ ఈసారి రాకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అసలు ఎన్నికల సీజన్ కావడంతో ఈ వార్తలన్నింటికీ విశాల్ చెక్ పెట్టేశారు.

నాకొద్దు బాబోయ్!

‘నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేనే లేదు. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదు. రాజకీయాల్లోకి రాకుండా కూడా ప్రజా సేవ చేయవచ్చు. తూత్తుకుడి జిల్లా విళాత్తికుళంలోని ఒక గ్రామంలో తాగునీటి బోరును వేయించాను. దీని వల్ల 250 కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి. ఇది నేను పాలిటిక్స్‌లో ఉండి చేసిన పని కాదు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే.. అదే మనల్ని ముందుకు తీసుకెళుతుంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు’ అని విశాల్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. రాజకీయాలొద్దు బాబోయ్.. ప్రజా సేవ ఎలాగైనా చేయొచ్చని క్లియర్ కట్‌గా మరోసారి విశాల్ చెప్పేశారన్న మాట.

మార్క్ ఆంటోని వచ్చేస్తున్నాడహో!

ఇదిలా ఉంటే.. విశాల్ హీరోగా, ‘పెళ్లి చూపులు’ ఫేం రీతూవర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. సినిమాలో ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్‌లు ప్రధాన పాత్రలో నటించారు. సెప్టెంబర్-15న థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్‌ లుక్స్‌తోపాటు.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరోవైపు.. చిత్రబృందం రిలీజ్ చేసిన ‘I Love U Ne’ అనే సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక నటుడిగా తనకు నెక్ట్స్‌ లెవల్‌ సినిమా అని విశాల్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో విశాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో వీక్షించిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడంతో.. సినిమాపై విశాల్ అండ్ టీమ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంది.

ఇవీ చదవండి:

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్

నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసిన ఆ హీరోపై పగ ఇలా తీర్చుకున్నా: విజయ్ సేతుపతి

Google News