విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!

ఇండస్ట్రీలోనే చక్కటి జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత తమ నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలకడం అందరినీ నివ్వెరపరిచింది. నాటి నుంచి అక్కినేని ఫ్యామిలీ, సమంత ఎక్కడా కలిసినట్టుగా కానీ.. ఒకరి గురించి ఒకరు మాట్లాడినట్టుగా కానీ దాఖలాలు అయితే లేవు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 7 లాంచ్ ఈవెంట్ స్టేజీపై సమంత గురించి నాగార్జున అడగటం ఆసక్తిని రేకెత్తించింది. నిన్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ సీజన్‍కు కూడా నాగార్జునే హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ అన్నీ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించాయి. ఎవరూ ఊహించని సీజన్ బిగ్‌బాస్ సీజన్ సెవెన్ అంటూ నాగార్జున ప్రోమోలు, ప్రమోషన్స్‌లలో అయితే చెప్పారు. ఈ క్రమంలోనే నిన్న 14 మంది కంటెస్టెంట్‌లతో బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. అయితే నిన్న ప్రారంభ షోలో హీరోలు విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో ఆకట్టుకున్నారు.

అయితే విజయ్ దేవరకొండను నాగ్.. మీ హీరోయిన్ సమంత ఎక్కడ? అని నాగ్ అడిగారు. విజయ్ దేవరకొండ మాత్రం నవ్వుతూ చూశారు అంతే. దీనికి సమాధానం ఏమీ చెప్పలేదు. నాగ్ ఇలా అడగడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎప్పుడూ 20 మంది.. అంతకు మించి ఉండే కంటెస్టెంట్లు ఈ సారి మాత్రం 14 మందితోనే ప్రారంభమైంది. మరి మున్ముందు మరికొందరిని పంపిస్తారేమో చూడాలి.

ఇవీ చదవండి:

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి సడెన్ సర్‌ప్రైజ్