ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు.

ఈ ఇంటరాక్షన్‌ సెషన్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు నా గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఓ టికెట్‌ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. ఫ్రీగా ప్రేమ మాత్రమే దొరుకుతుందని.. టికెట్‌ దొరకదు అని బాద్‌షా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు.. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందేనన్నారు. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండొద్దంటూ సూచించారు. 

మీ ప్రియురాలిని తీసుకుని వెళ్లి టికెట్‌ కొనుక్కోండని షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రంలో ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే దీపికా పదుకొణె సైతం మెరవబోతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించగా.. అట్లీ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!

పొలిటికల్ ఎంట్రీపై విశాల్ ఫుల్ క్లారిటీ..

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

‘ఖుషి’ ట్రైలర్ చూసి అక్కడి నుంచి నాగ చైతన్య వెళ్లిపోయాడా?

Google News