ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిపోయి ఆ తరువాత బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసి మరింత నేమ్, ఫేమ్ సంపాదించుకున్న కమెడియన్స్‌లో ఒకరు మహేష్ విట్టా. ఆపై టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగాడు. అయితే అందరి మాదిరిగానే మహేష్ విట్టా కూడా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. కానీ అందిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరుకున్నాడు.

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్‌ రాయలసీమ యాసలో మాట్లాడుతూ వెండితెరపై అలరించాడు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన మహేష్ విట్టా.. తాజాగా తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా జరిగింది. తన పెళ్లి ఫోటోలను మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

తన చెల్లెలి స్నేహితురాలైన శ్రావణి రెడ్డిని సుమారు  ఐదేళ్లుగా మహేష్ విట్టా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే చెప్పాడు కానీ పేరు మాత్రం రివీల్ చేయలేదు. తొలినాళ్లలో మహేష్ ప్రేమను శ్రావణి రిజెక్ట్ చేసిందట. ఆపై పట్టుబట్టి మరీ ఆమెను ఒప్పించాడట. ప్రస్తుతం శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మహేష్ అటు సినిమా.. ఇటు నిర్మాణ సంస్థ కార్యక్రమాలు చూసుకుంటూ బిజీబిజీగా కాలం గడిపేస్తున్నాడు.

ఇవీ చదవండి:

ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!

పొలిటికల్ ఎంట్రీపై విశాల్ ఫుల్ క్లారిటీ..

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-7.. కంటెస్టెంట్స్ ఎవరంటే..

ఈ పాత్రకు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే..!

ఇండియాలోనే అత్యంత ధనిక నటుడు నాగార్జున!

Google News