మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

అక్కినేని నాగ చైతన్య ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా 14 ఏళ్లు అవుతోంది. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చైతు.. ఎందుకోగానీ స్టార్ హీరో రేంజ్‌కి మాత్రం ఎదగలేకపోయాడు. ఆయన కెరీర్‌లో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. దీంతో చై కెరీర్ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇక సమంతతో విడాకుల అనంతరం కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు కానీ ఆయన కెరీర్‌లోనే ఒక్క హిట్ కూడా లేదనే చెప్పాలి. 

తాజాగా చై.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్‌లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇక్కడే కాదు.. ఇతర దేశాల్లోనూ చై, శోభితాలు జంటగా కనిపించారు. దీంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. ఈ పుకార్లపై వీరిద్దరూ ఇప్పటి వరకూ స్పందించింది లేదు. అయితే వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించి ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.

Advertisement

ఇక తాజాగా నాగ చైతన్య, శోభితలకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా.. చై రిఫర్ చేసిన పుస్తకాన్ని పట్టుకొని శోభితా ఫోటోలకు ఫోజ్ లు ఇస్తూ కనిపించి మరోసారి ఈ వార్తలకు ఆజ్యం పోసింది.

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

కొద్ది రోజుల క్రితమే గ్రీన్‌లైట్స్ పుస్తకం జీవితానికి ఒక ప్రేమలేఖ లాంటిదని చెప్పి ఆథర్‌కు చై థ్యాంక్స్ చెప్పాడు. తాజాగా అదే బుక్ ను శోభితా షేర్ చేస్తూ.. గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకమని తెలిపింది.

ఎంత అపురూపమైన జీవిత కథ అని కొనియాడటంతో చైతన్య ఈ బుక్ చదవమని సజెస్ట్ చేశాడా.. ? లేక బుక్ గిఫ్ట్ ఇచ్చాడా.. ? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

మొత్తానికి మరోసారి నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల అడ్డంగా దొరికిపోయారు.

ఇవీ చదవండి:

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..

ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది.. టికెట్ కాదు.. అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుఖ్..

విజయ్.. Where is Samantha అని అడిగిన నాగ్!