మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..

మహేష్ - షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్.. 

జవాన్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించింది. అసలు ప్రమోషన్స్ కంటే ఎక్కువగా కేవలం మూవీ ట్రైలర్‌తో ఈ సినిమా జనాల్లోకి బీభత్సంగా వెళ్లిపోయింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఈ మూవీ టికెట్స్ అయితే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్సే ఓ రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాయి.

షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడు అట్లీ రేంజ్ కూడా బీభత్సంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో మరో ఆసక్తికర ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఈ చిత్రాన్ని కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రమోట్ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ చిత్ర విషయమై సూపర్ స్టార్ మహేష్ బాబు, షారుఖ్ మధ్య సంభాషణ తెగ వైరల్ అవుతోంది.

జవాన్ చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ చెబుతూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. షారుఖ్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేయనున్నాడంటూ మహేష్ తన ట్వీట్‌లో తెలిపాడు. అంతేకాదు.. తాను తన కుటుంబంతో పాటు జవాన్ మూవీ చూడబోతున్నట్లు వెల్లడించాడు.

మహేష్ ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ స్పందించారు. ‘‘థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. నీకు జవాన్ నచ్చుతుందని భావిస్తున్నా. నువ్వు ఏ రోజు సినిమా చూడాలని అనుకుంటున్నావో చెబితే నీతో పాటు నేను కూడా సినిమా చూస్తాను. నీ కుటుంబానికి నా ప్రేమ పూర్వక అభినందనలు’’ అని షారుఖ్ తెలిపారు.

ఇవీ చదవండి:

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!

ప్రియురాలిని వివాహమాడిన మహేష్ విట్టా..