శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ అంటేనే కాస్త ఆసక్తికరంగా అనిపించింది ప్రేక్షకులకి. మరి వీరిద్దరూ కలిసి నటించిన సినిమాకు టైటిల్ కూడా మరింత ఆసక్తికరమే. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అంటూ ఒక క్యాచీ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇచ్చేసింది. ఈ సినిమాకు మహేష్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.  

మురళీశర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. పెళ్లి కాకుండానే పిల్లలను కనాలనుకునే మిస్ శెట్టి ప్రేమలో మిస్టర్ పొలిశెట్టి పడటం.. ఆ తరువాత వారి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి అంశాలకు హాస్యాన్ని జోడించి రూపొందించారు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాపై ప్రేక్షకులు ట్విటర్ వేదికగా ఏమంటున్నారు?

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. నవీన్ – అనుష్క జోడీకి మంచి మార్కులు పడుతున్నాయి. సినిమా క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

నవీన్ పోలిశెట్టి అయితే జీవించేశాడట. కామెడీ, సెంటిమెంట్ ప్రతిదీ అద్బుతంగా వర్కౌట్ అయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో.. ఆమెకు ఈ చిత్రం అదిరిపోయే కమ్ బ్యాక్ అవుతుందట.

ఇక నవీన్ పోలిశెట్టి ఖాతాలో అయితే హ్యాట్రిక్ ఫిక్స్ అయిపోయిందంటున్నారు. అసలు నవీన్ కామెడీ టైమింగే అదుర్స్ అంటున్నారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయిందట. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తోంది.

ఇవీ చదవండి:

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

అనుష్కకు పెళ్లి చేసుకోవాలని ఉందట.. అయితే..

రష్మి కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు..: సుధీర్ ఎమోషనల్

వామ్మో.. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా..!