విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

విజయ్ దేవరకొండ - రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ గత కొంతకాలంగా బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పైకి అదేమీ లేదంటున్నా కూడా ఏదో ఒక సందర్భంలో అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. ఈ జంట గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించింది. అయితే గీత గోవిందం టైం నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. అప్పటి నుంచి కూడా వీరిద్దరికీ సంబంధించి ప్రతిదీ హాట్ టాపికే అవుతోంది. 

ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక జంటగా కనిపించి ఒకసారి బుక్ అయ్యారు. అలానే మాల్దీవుల్లో జంటగా వెకేషన్ ఎంజాయ్ చేసిన పిక్స్ బయటకు వచ్చాయి. అలాగే విజయ్ దేవరకొండ టీ షర్ట్ ధరించి రష్మిక ఒక ఎయిర్‌పోర్టులో దొరికిపోయింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కావాలనే ప్రేక్షకులకు తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే.. ఎలాంటి వారికైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ఆలోచన వస్తుంది.

ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్‌ని బలపరిచే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తమకు ఇష్టమైన హీరోహీరోయిన్లను ఫ్యాన్స్ చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా తన అసిస్టెంట్ వివాహం కోసమని రష్మిక హైదరాబాద్‌కు వచ్చింది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక ఉన్నట్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి తెలుస్తోంది. గతంలో విజయ్ తన నివాసంలోని లాన్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే ప్లేస్‌లో రష్మిక కూడా ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటో కనిపించిన పిట్టగోడ వీరిద్దరినీ పట్టించేసింది.

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

Google News