మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైలెంట్‌గా హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం పవన్ గురించి ఒక ఆసక్తికర టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం గుంటూరు కారంకు పవన్ కళ్యాణ్ తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారట.

ఇటీవలి కాలంలో ఓ సభలో పవన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ తాను అభిమానిస్తానంటూ ఒక్కొక్కరి పేరును ప్రస్తావిస్తూ మరీ చెప్పారు. తాజాగా పవన్ పుట్టినరోజున మహేష్ కూడా విషెస్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఇక పవన్ జల్సా మూవీ కోసం మహేష్ ఎలా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాడో.. అలాగే పవన్ ఇప్పుడు గుంటూరు కారం మూవీ కోసం తన వాయిస్‌ ఓవర్ ఇవ్వనున్నారట. సినిమా ప్రారంభానికి ముందు పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని టాక్.

Mahesh Babu Birthday Special: 'Guntur Kaaram' Super Mass Poster

మొత్తానికి ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత అనే దానిపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు అలాంటిదేమీ లేదు అంటుండగా.. మరికొందరు మాత్రం గుంటూరు కారం దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి ఆయన కోసం పవన్ రంగంలోకి దిగారని చెబుతున్నారు.

త్రివిక్రమ్ ఇప్పటికే వాయిస్ ఓవర్ కోసం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారని కూడా టాక్ నడుస్తోంది. అందునా మహేష్ కోసం కూడా పవన్ ఏదైనా చేయడానికి వెనుకాడరని అంటున్నారు. ఇక చూడాలి ఇందులో నిజెమంతో..

ఇవీ చదవండి:

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

Google News