శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైపోయింది. కంటెస్టెంట్స్ అంతా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు. గొడవలు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇక ఈ 14 మందిలో శుభశ్రీ మాత్రం మోస్ట్ ఇంటెలిజెంట్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ముందే ఓ వీడియో అందరూ చేస్తూనే ఉంటారు. ఈ అమ్మడు మాత్రం చాలా తెలివిగా చేసి తన మాటలతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కే గాలం వేసింది.

బిగ్‌బాస్‌కు వెళ్లడానికి ముందు చేసిన వీడియోలో పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ ఓజీలో శుభశ్రీ నటిస్తోందట. ఈ విషయాన్ని చెప్పి పవన్ ఫ్యాన్స్‌కే ఈ అమ్మడు గాలం వేసేసింది. అసలే బిగ్‌బాస్‌కి వెళ్లే వాళ్లంతా పవనే తమ దైవం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. శుభశ్రీ కూడా పవన్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన అప్ కమింగ్ మూవీలో నటించడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. ఆ సినిమా చాలా స్టైలిష్‌గా ఉంటుందని వెల్లడించింది.

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేనని శుభశ్రీ వెల్లడించింది. ఇక అంతేనా? పవర్ స్టార్ అంటే.. పవర్ జనరేట్ చేస్తున్నట్టే ఉంటుందని… ఊరికే పవర్ స్టార్‌లు అయిపోరంటూ కితాబిచ్చింది. పవన్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. ఆయన కళ్లల్లోనే పవర్ ఉంటుందని తెలిపింది.

పవన్ అలా నడిచి వస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తుందంటూ ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ తెలిపింది. ఇప్పుడు ఈ వీడియోను ఆమె కుటుంబ సభ్యులు బీభత్సంగా వైరల్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

భోళా శంకర్ దెబ్బకు ఆ సినిమాను హోల్డ్ చేసిన చిరు..!

Google News