ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

I Bomma

ఐబొమ్మ గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. థియేటర్‌లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఏమీ తినకుండా కేవలం సినిమా మాత్రమే చూసొస్తే వెయ్యి రూపాయలపైనే ఒడుస్తాయి.ఈ క్రమంలోనే మధ్యతరగతి వర్గమంతా ఐ బొమ్మను ఆశ్రయిస్తోంది. ఓటీటీల్లోకి వచ్చిన ప్రతి తెలుగు మూవీ కొన్ని గంటల్లోనే ఐబొమ్మలోకి వచ్చేస్తుంది. అయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ లైట్‌గానే తీసుకుంది.

ఈ క్రమంలోనే ఐ బొమ్మ ట్రెండ్ మార్చింది. థియేటర్లో విడుదలైన చిత్రాలను సైతం ఐబొమ్మలోపెట్టేస్తోంది. ఇది సినీ ఇండస్ట్రీకి కాస్త మండింది. దీంతో ఈ వెబ్‌సైట్ మీద టాలీవుడ్ ఫోకస్ పెట్టింది. దీంతో తమను టార్గెట్ చేస్తారా? అంటూ ఐ బొమ్మ ఫైర్ అయిపోయి ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసింది. తమపై ఫోకస్ పెడితే.. తాము కూడా ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది. హీరోలు, హీరోయిన్లకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అని ప్రశ్నించింది.

లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ కూలి పెంచితే వారి కుటుంబాలు బాగుపడతాయని ఐబొమ్మ తెలిపింది. అయితే ఇలా ఐబొమ్మ ఫైర్ అయినా కూడా ఇండస్ట్రీ రెస్పాండ్ కాకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ ఇండస్ట్రీని ఇలాగే ఇబ్బంది పెట్టిన తమిళ్ రాకర్స్ అనే వెబ్సైట్‌పై కోలీవుడ్ ఫోకస్ పెట్టింది. ఆ వెబ్సైట్ వాళ్లను పట్టుకొని తమిళ్ రాకర్స్‌కు చెక్ పెట్టేసింది. మరి ఐబొమ్మ విషయంలోనూ టాలీవుడ్ ఇలాగే స్పందిస్తుందా? లేదంటే.. లైట్ తీసుకుంటుందా? చూడాలి.

ఇవీ చదవండి:

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

‘జవాన్‌’ రెస్పాన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

మహేష్ – షారుఖ్‌ల మధ్య ఆసక్తికరంగా ట్వీట్స్..  

మరోసారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల

Google News