నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఖుషి సినిమా ప్రాణం పోసింది. గత కొంతకాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో సక్సెస్ వరించింది. అయితే దీనిని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో విజయ్ లేడని తెలుస్తోంది. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడంలో భాగంగా వంద కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఓ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. 

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నామని.. దీనిపై ఎవరూ స్పందించట్లేదంటూ సదరు నిర్మాణ సంస్థ కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు.. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు కాబట్టి వారితో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నామంటూ వెటకారంగా ట్వీట్ చేసింది. అంతే ఆ ట్వీట్‌తో విజయ్ దేవరకొండకు షాక్ తగిలినట్టైంది.  

ఈ వ్యవహారంపై విజయ్‌ తండ్రి గోవర్దన్‌ రావు కాస్త ఘాటుగానే స్పందించారు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా ఫ్లాప్ సమయంలో తన కుమారుడు రెమ్యునరేషన్‌లో సగం రిటర్న్ చేశాడని.. తనకు ఇస్తానన్న ఫ్లాట్‌ కూడా వద్దన్నాడని ఇంతకు మించి ఏం చేయాలని ప్రశ్నించారు. అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్‌ ఏం చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయమని గోవర్దన్ రావు తెలిపారు. అభిషేక్‌ చాలాకాలంగా తమను ఇబ్బందిపెడుతున్నాడని.. తన కొడుకును బ్లాక్‌మెయిల్‌ చేయాలని చేస్తున్నాడన్నారు. కానీ అతడి పప్పులేమీ ఉడకవని.. ఇకపై అభిషేక్‌ నామాతో విజయ్‌ సినిమాలు చేయడని గోవర్దన్ రావు తెలిపారు.

జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..

ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..

శెట్టి జంట ఇరగదీశారట.. బొమ్మ బ్లాక్ బస్టరేనట..

Google News