నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి ఆపై ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి దాదాపు 10కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ ఎందుకో హీరోయిన్‌గా మాత్రం ఒక్క సినిమాలో కూడా అవకాశం సంపాదించుకోలేకపోయింది. తాజాగా ఏమైందో ఏమో కానీ గాయత్రి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని.. హెల్త్ కండీషన్ క్రిటికల్‌గా ఉందని తెలిపింది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని పేర్కొంది. కనీసం తన అనారోగ్యానికి చికిత్స తీసుకునేందుకు కూడా డబ్బులు లేవని.. దీంతో ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నామని గాయత్రి వెల్లడించింది.

నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు.. క్రిటికల్ కండీషన్‌లో ఉన్నా: గాయత్రి గుప్తా

అంతే కాకుండా తన తండ్రిని నేను ఎప్పుడు కూడా తండ్రిలా భావించలేదంటూ మరో సంచలనానికి తెరదీసింది. అసలే గాయత్రి గుప్తాకు బోల్డ్ అనే ట్యాగ్ లైన్ ఉంది. గతంలో కూడా పలు వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అవి చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. మరీ ఇంత బోల్డ్ ఏంటిరా బాబోయ్ అని ముక్కున వేలేసుకున్నారు. తనకు అవకాశాలు తగ్గడంపై గాయత్రి మాట్లాడుతూ.. డైరెక్టర్స్‌కు కావాల్సిన క్యారెక్టర్‌కు తగినంత పొటెన్షియల్‌ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేసుకుంటారంటూ తెలిపింది.

ఇవీ చదవండి:

నా కొడుకును బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి సంచలనం

జైలు సెంటిమెంటు పెట్టు.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టు..

ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

శుభశ్రీ.. ఏకంగా ఒక్క వీడియోతో పవన్ ఫ్యాన్స్‌కే గాలం వేసిందిగా..

మహేష్ కోసం రంగంలోకి దిగిన పవన్..

విజయ్ దేవరకొండ – రష్మికలను పట్టిచ్చిన పిట్టగోడ.. నెటిజన్లు షాక్..